Wednesday, April 2, 2014

Loving Hugs


Wednesday, March 12, 2014

మౌన రాగం



తిరిగిరాని నా కంటి వెలుగు, నీ కళ్ళలో కలగా మారినా...
కాలంలో కలిసిపోయిన నా చిరునవ్వు, నీ పెదవులపై చిగురించినా...
లెక్కలేనన్ని రోజులు నీ ఆలోచనలలో కరిగిపోయినా...
రగిలిన ప్రేమ జ్వాల నా హృదయాన్ని దహించివేస్తున్నా..

నిస్వార్థంగా ప్రేమించానే కానీ, ఏనాడూ నీ ప్రేమను ఆశించలేదు.
అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.

ఒంటరిగా మన ప్రేమను గెలిపిస్తూనే ఉంటాను.




Wednesday, February 12, 2014

అనిర్వచనీయమైన “ప్రేమ”



ప్రపంచంలో ప్రతిదానికి ఓ నిర్వచనం ఉంటుంది.
కానీ  నిర్వచనం లేనిది ఏదైనా వుంది అంటే అది ప్రేమే.

ఆమె అతనిలో స్వరపరచిన సంగీతం గుండె చప్పుడై
ఏదో తెలియని అనుభూతిని కలిగిస్తుంటే
ఆ అనుభూతిని ఆమెకు నిర్వచించాలని
అతడు చేసే ప్రయత్నమే.... ప్రేమ

అతడు ఆమెలో మ్రోగించిన కోటి వీణల
శ్రుతిలయలకు పరవసించి అతడి అడుగులకు 
అడుగులు జతకలిపి,
అతనిలో కలిసిపోయిన ఆమెకు
అతని సంతోషమే... ప్రేమ



Wednesday, January 15, 2014

హృదయాంజలి


తొలిసారి నా మనసులో మాటను, తన నోటితో చెప్తుంటే విన్నాను.

ప్రేమించడం అంటే జీవితాంతం ప్రేమించడం, అని తెలిసిన తనకి
తిరిగిరాని ప్రేమ కోసం ఆరాటపడటం దుఃఖాన్ని పెంచుతుందే కానీ,
తగ్గించదు అని తెలియదు.

తను ఎలా వున్నా పర్లేదు నేను చూసుకుంటాను అని చెప్పినప్పుడు
తనలో ఆ ధీమా,
లైఫ్ లో ఇలా జీవించాలి అని
తను కన్న కలలు,
ఒక మగాడి నిశ్శబ్దం కింద నలిగిపోతుంటే..

నిన్ను బయటకు తీసుకుని రాలేక
నా స్నేహానికి నిన్ను సంతోషపెట్టే బలం ఉన్నా,
నీ బాధను దూరం చేసే శక్తి లేక

సమాధానం లేని ప్రశ్నలకు జవాబులు వెతుకుతూ... 
దూరంగా  నిలబడి ఆలోచిస్తూ కూర్చున్నాను.