తొలిసారి నా మనసులో మాటను, తన నోటితో చెప్తుంటే విన్నాను.
ప్రేమించడం అంటే జీవితాంతం ప్రేమించడం, అని
తెలిసిన తనకి
తిరిగిరాని ప్రేమ కోసం ఆరాటపడటం దుఃఖాన్ని
పెంచుతుందే కానీ,
తగ్గించదు అని తెలియదు.
తను ఎలా వున్నా పర్లేదు నేను చూసుకుంటాను
అని చెప్పినప్పుడు
తనలో ఆ ధీమా,
లైఫ్ లో ఇలా జీవించాలి అని
తను కన్న కలలు,
ఒక మగాడి నిశ్శబ్దం కింద నలిగిపోతుంటే..
నిన్ను బయటకు తీసుకుని రాలేక
నా స్నేహానికి నిన్ను సంతోషపెట్టే బలం
ఉన్నా,
నీ బాధను దూరం చేసే శక్తి లేక
సమాధానం లేని ప్రశ్నలకు జవాబులు వెతుకుతూ...
దూరంగా నిలబడి ఆలోచిస్తూ కూర్చున్నాను.
No comments:
Post a Comment