Wednesday, February 12, 2014

అనిర్వచనీయమైన “ప్రేమ”



ప్రపంచంలో ప్రతిదానికి ఓ నిర్వచనం ఉంటుంది.
కానీ  నిర్వచనం లేనిది ఏదైనా వుంది అంటే అది ప్రేమే.

ఆమె అతనిలో స్వరపరచిన సంగీతం గుండె చప్పుడై
ఏదో తెలియని అనుభూతిని కలిగిస్తుంటే
ఆ అనుభూతిని ఆమెకు నిర్వచించాలని
అతడు చేసే ప్రయత్నమే.... ప్రేమ

అతడు ఆమెలో మ్రోగించిన కోటి వీణల
శ్రుతిలయలకు పరవసించి అతడి అడుగులకు 
అడుగులు జతకలిపి,
అతనిలో కలిసిపోయిన ఆమెకు
అతని సంతోషమే... ప్రేమ