Tuesday, March 29, 2011

నేను, మనం, నువ్వు




ప్రేమ నన్ను మనం గా మార్చింది,
మనల్ని మళ్లీ నన్నుగా చేసింది,
నిన్ను నా ఆలోచనగా మార్చింది,
చివరికి నన్నే నిన్నుగా చేసింది.





Thursday, March 24, 2011

Expresing Love (PART-I)

ప్రేమ గురించి చాలా వరకూ అందరికి తెలుసు, అలాగే ప్రేమ గురించి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అబిప్రాయాన్ని కలిగి ఉంటారు. కొంత మంది పెళ్లి అయ్యే వరకే ప్రేమ అని rule పెట్టుకున్నట్టు అక్కడితో ప్రేమించడం మానేస్తారు.
నిజం చెప్పాలంటే ప్రేమించడం మానరు, కాని ఆ ప్రేమను ఒకరికి ఒకరు తెలియచేసుకోరు.కొంత మంది పెళ్లి అయ్యేవరకే  ప్రేమని EXPRESS చేస్తారు.

ఇంకొంత మంది  పెళ్లి అయిన తర్వాత నుండి ఒక నెల వరకూ లేదా ఆరు నెలల వరకూ ప్రేమని express చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే  maximum one year వరకూ లవ్ చేస్తారు. అంటే నా ఉద్దేశం లవ్ స్టార్ట్ అయినప్పటి నుండి పెళ్లి అయిన one year వరకు వున్నా time లో చాల మంది వాళ్ళ లవ్ ని ఏదో రోజు ఒక పక్కన పెట్టేసి అదే ఈ సంసారం అనే సాగరంలో ఈదుతూ ప్రేమించిన వ్యక్తి కి ఆ ప్రేమను తెలియచేయడం మరచిపోతున్నారు.  even arranged marriage చేసుకున్న వాళ్ళు కూడా same to same.   

మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మొదలు పెట్టినప్పటి నుండి I LOVE YOU అని messages లో, ఎదురుగా ఉన్నప్పుడు, phone లో ఇలా వేరు వేరు situations లో ఒకరికి ఒకరు చెప్పుకునే ఉంటారు. 

అప్పుడు చెప్పుకున్నారు అంటే మీరేమి ముందే చెప్పుకోలేదు కదా కలిసినప్పుడు ప్రతిసారి ఐ లవ్ యు అని చెప్పుకోవాలి అని, కానీ పెళ్లి అయిన తర్వాత ఏమవుతుంది ? ఎందువల్ల మీలోని  ప్రేమను express చేయడంలేదు ? పిల్లలు పుట్టారానో, పుడుతున్నారనో లేక పెద్దవాళ్ళం అవుతున్నాము అనో, డబ్బులు సంపాదించాలనో , పిల్లల్ని బాగా చదివించాలనో, వాళ్ళను ప్రయోజకుల్ని చేయాలనో  ఇలా ఏవో కారణాల వల్ల చాలామంది వాళ్ళ ప్రేమను express చేయడం మరచిపోతారు. తర్వాత మెల్లగా మరచిపోతారు. ఇలా మరచిపోవడం వల్ల వచ్చే problems చాలానే వస్తాయి. 

 వాటిలో ఒకటి గొడవ పడటం. నేను చాలామందిని అడిగాను ఎందుకు అలా గొడవ పడతారు అని కానీ వాళ్ళందరి సమాధానం ఒకటే. గొడవ పడినంతసేపు  చాల సీరియస్ గా గొడవ పడుతున్నారు even ఒకరంటే ఒకరికి చిరాకు కలిగేలా లేక life పైనే విరక్తి కలిగేలా కానీ ఆ గొడవ తర్వాత adjust అయిపోయి బాగానే కలిసి వుంటున్నారు and అలా గొడవ పడటం లో thrill వుంది అని ఒకరు, మజా వుందని ఇంకొకరు చెబుతున్న్నారు. ఇంకొంతమంది  ఐతే ఇది common అని సలహా..! ఎవరి ఇష్టం వారిది but ఈ గొడవని అస్సలు పట్టించుకోకుండా common అని అను కునే వాళ్ళు మాత్రం ఆ గొడవలో partner ego hurt చేసినవాళ్ళే, ఒకరు adjust అవుతుంటే.. ఇంకొకరు ఇది common అని చెప్పడంలో  అర్థం ఇదే. 




ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే...  

పెళ్లికాక ముందు ప్రేమించుకున్నట్టే, అంతే strong గా పెళ్లి అయిన తర్వాత  కూడా ప్రేమించుకోవడం సాధ్యమేనా ?

arranged marriage చేసుకున్నవాళ్ళు  పెళ్లి అయిన తర్వాత ప్రేమించడం సాధ్యమేనా ?  

సాధ్యం అయితే ఎంత కాలం ? అసలు ఎలా సాధ్యం ?  లవ్ ని ఇవ్వాలన్న, తీసుకోవాలన్న ఏమి చేయాలి ? 




మీరు తట్టుకోలేనంత ప్రేమని మీ LOVER నుండి రోజూ అందుకోవడం మీకు ఇష్టమేనా...?? 



Wednesday, March 23, 2011

Shades Of Love


అసలు ఈ topic గురించి నేను ఏమైనా చెప్పగలనా అనిపిస్తుంది. బైక్ పై ఇంటికి వస్తుంటే వచ్చింది ఈ ఐడియా Flavours Of Love అని ఒక పోస్ట్ రాస్తే బాగుంటుంది అని, కానీ కొంత దూరం వచ్చాక పేరు మారిపోయింది Shades Of Love అని.

బట్ నాకు అర్థం అవుతుంది, ఈ పోస్ట్ చేసిన తర్వాత కామెంట్స్ బాగా పెరుగుతాయి అనుకుంటున్నాను. నేను చెప్పేది నన్ను తిట్టే వాళ్ళ గురించి.



Wednesday, March 9, 2011

నువ్వు



నీ చేయి పట్టుకుని రెండు గంటలు నీతో కలసి సినిమా చూసినప్పుడు, బీచ్ లో నీ వడిలో తల పెట్టుకుని నీతో కబుర్లు చెబుతున్నప్పుడు, నాకు కలిగిన ఆనందం ఎప్పుడూ మరచిపోలేను. నీతో కలసి పార్క్స్ లో, రోడ్ పక్కన అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ నువ్వు చెబుతున్న కబుర్లు వినడం నాకు చాల ఇష్టం. నువ్వేమో జోక్స్ చెబుతూ, మధ్య మధ్యలో నన్ను ఆట పట్టిస్తూ నువ్వు చేసే అల్లరి.... ఒక్కడినే బైక్ పై వెళుతున్నప్పుడు గుర్తుకు వచ్చి అనుకోకుండా వచ్చే నవ్వును ఆపుకోలేక నేను పడే తంటాలు అన్ని ఇన్ని కాదు. నవ్వు వస్తే పర్లేదు కానీ పక్కన వాళ్ళు ఎవరైనా చూసి ఏమనుకుంటారో అని ఎంత కష్టపడతానో తెలుసా కంట్రోల్ చేసుకోవడానికి. చాల సార్లు నైట్ నీతో చాట్ చేస్తూ మధ్యలో సడన్ గా నిద్రపోయి ఉదయాన్నే లేచి నీ మెసేజెస్ చూసుకుని నాకోసం పడుకోకుండా చాల సేపు వెయిట్ చేసావని తెలుసుకుని నేను ఎంతగా ఫీల్ అవుతానో తెలుసా. నా సంతోషమే నీ సంతోషం అని నవ్వుతూ నువ్వు నా పక్కనే వున్నావని నాకు తెలుసు.