Tuesday, April 5, 2011

The Journey Of True Love





నిన్నటి వరకూ కాలం చాల వేగంగా కదిలింది, క్షణాల గురించి ఆలోచనే లేదు. కాని ఇప్పుడు ఒక్కసారిగా అంతా మారిపోయింది.
క్షణం క్షణం గడుస్తున్న కొద్దీ నా హృదయంలో ఏవో అలజడులు. క్షణం ఒక యుగంలా అనిపిస్తుంది.
దీనంతటికీ కారణం నువ్వే కదా.... అవును నువ్వే....
నీతో ఉన్నపుడు రోజులు క్షణాలైపోతున్నాయి, నీకు దూరంగా క్షణమొక యుగంలా అనిపిస్తుంది.
నిన్ను కలిసినప్పుడు నీ కళ్ళల్లోకి చూస్తూ నన్ను నేనే మరచిపోతున్నాను. నీ మాటలు వింటున్నప్పుడు నా పెదవులపై చిగురించే చిరునవ్వు చెబుతుంది నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో.
రోజూ ఒక్కసారి అయినా నీతో మాట్లాడకుండా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను.... ఈ ఆరాటం అంతా ప్రేమేనని, నువ్వు లేకుంటే నేను లేనని నీకు తెలుపాలని ఉంది.

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలని ఉంది. కాని నిన్ను కలిసినప్పుడు మాటలే కరువుతున్నాయి. ఎలా తెలుపను నా ప్రేమను ?
నీ ఆలోచనలే నా ఊపిరిగా... నీ కోసం ఎదురుచూస్తూ గడుపుతున్నాను. ఇంత ప్రేమ ఎప్పుడు వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు.
ప్రేమ నాలో ఎన్నో మార్పులు తెచ్చింది. ఏమైంది నా కోపం అంతా...

Friday, April 1, 2011

RED ROSE




నేను ఆమెతో కలిసి నమ్మకం అనే పూల కుండీలో ఓ గులాబీ మొక్కను నాటాను,
దానికి స్నేహం అనే అమృతాన్ని పోసి పెంచుకున్నాం,
నాకు ఆమెకు తప్ప మరెవరికి కనిపించని మనసనే విశాల ప్రపంచంలో 
అది దినదిన ప్రవర్ధమానమై ఆకులు రెమ్మలూ వేసింది. మా నిరీక్షణ ఫలించి కొన్నాళ్ల తర్వాత 
ఆ గులబికన్య మొగ్గ తొడిగింది. దానిపట్ల మా ప్రేమ రెట్టింపైంది. 
మొగ్గ విడి స్వచ్ఛమైన తెల్లగులాబి విరబూస్తుంది అనుకున్నాం.
అయితే కొన్నాళ్ల తర్వాత పచ్చని చిగుళ్లను చీల్చుకుంటూ వచ్చిన గులాబి రేకును చూసి ఇద్దరం ఆశ్చర్యపోయాం.
అది... ఎర్రగులాబీ. మా హృదయగానం విని అది మరింత రాగరంజితమైంది.