Wednesday, November 6, 2013

కాబోయే శ్రీమతికి “ ప్రేమలేఖ ”



ప్రియమైన శ్రీమతికి,

నిన్ను చూడకుండానే.... నీ ప్రేమలో పడిపోయాను, అసలు నువ్వు ఎక్కడ ఉన్నవో తెలియదు,
ఎలా ఉంటావో తెలియదు, నా కళ్ళతో నిను చూడలేకపోవచ్చు, నీ మాటలు వినలేకపోవచ్చు,
నీస్పర్శను పొందలేకపోవచ్చు.



కానీ... ప్రతిక్షణం నిన్నే తలచుకుంటూ... నీ ఆలోచనలలో గడుపుతూ...  నీ కళ్ళల్లోకి చూసే
ఆ క్షణం కోసం.... అనుక్షణం తపిస్తున్నాను.  ఇది ప్రేమే కదా...
కానీ ఈ ప్రేమ మొదలుకాక ముందే... విరహాన్ని పరిచయం చేసావు.



నా కళ్ళు నీ కోసం ఎదురుచూస్తున్నాయి, అద్దం ముందు నన్ను నేను చూసుకుంటుంటే,
నా కళ్ళల్లో నువ్వు కనిపిస్తున్నావు... నిజం, నువ్వు ఎవరో ఇంకా తెలియకపోయినా....
నిరంతరం నా ఉహల్లో నువ్వే... నా శ్వాసలో సైలెన్స్ నువ్వు,  నా గుండె చప్పుడులో  రిథం నువ్వు,
నా నిద్ర లో కల నువ్వు,  ఇంకా చెప్పాలంటే నా ప్రాణం నువ్వు,

నీకోసం కనే కలలే ఇంత అద్భుతంగా ఉంటుంటే,    నా లైఫ్ లో నువ్వు...

నీ కోసం నిరీక్షణలో క్షణమొక యుగంలా గడుస్తుంది. హృదయమంతా నిండిన ఆ ప్రేమని,
ఒక్క చిన్న మాటతో నీకు చెప్పాలని... చిన్న ఊహతో మొదలైన నా ప్రేమ,
సముద్రమంత ప్రేమగా... మన ప్రేమగా మారాలనీ.... నా చిన్ని ఆశ.

ఎప్పుడు పూస్తుందో తెలియని గులాబి కోసం, ప్రతిరోజు ఎంతో ఆప్యాయంగా నీళ్ళు పోసి,
ఎలా పెంచుకుంటామో నా ప్రేమ కూడా అంతే...  భవిష్యత్తులో ఎర్రగులాబీ తోటలా విరబూసే
మన ప్రేమ కోసం,  ప్రేమతో నా ప్రేమను,  ప్రేమగా పంచుతున్నాను.

నీపై బెంగతో...  మా డాబాపై సన్నజాజితీగ చిక్కిపోయింది,
నా గులాబి మొక్క ఒక్క పువ్వు కూడా పూయడం లేదు,
పున్నమి రోజు చందమామ తొంగి తొంగి చూస్తున్నాడు, నువ్వు వచ్చావేమో అని...
సాగరానికి కోపం నిన్ను తీసుకుని రాలేదని, నా అడుగులను చెరిపేస్తున్నాడు...

ముళ్ళు గుచ్చుకుంటాయని తెలిసినా, గులాబిని పట్టుకుంటాము...
ఆ గులాబి ముళ్ళు గుచుకున్నప్పుడు వచ్చే తీయని బాదే.... ఈ ప్రేమలేఖ... 




 నీకోసం నిరీక్షిస్తూ...
                                                                    ప్రేమతో.... నీ రామ్




No comments:

Post a Comment