నీ చేయి పట్టుకుని రెండు గంటలు నీతో కలసి సినిమా చూసినప్పుడు, బీచ్ లో నీ వడిలో తల పెట్టుకుని నీతో కబుర్లు చెబుతున్నప్పుడు, నాకు కలిగిన ఆనందం ఎప్పుడూ మరచిపోలేను. నీతో కలసి పార్క్స్ లో, రోడ్ పక్కన అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ నువ్వు చెబుతున్న కబుర్లు వినడం నాకు చాల ఇష్టం. నువ్వేమో జోక్స్ చెబుతూ, మధ్య మధ్యలో నన్ను ఆట పట్టిస్తూ నువ్వు చేసే అల్లరి.... ఒక్కడినే బైక్ పై వెళుతున్నప్పుడు గుర్తుకు వచ్చి అనుకోకుండా వచ్చే నవ్వును ఆపుకోలేక నేను పడే తంటాలు అన్ని ఇన్ని కాదు. నవ్వు వస్తే పర్లేదు కానీ పక్కన వాళ్ళు ఎవరైనా చూసి ఏమనుకుంటారో అని ఎంత కష్టపడతానో తెలుసా కంట్రోల్ చేసుకోవడానికి. చాల సార్లు నైట్ నీతో చాట్ చేస్తూ మధ్యలో సడన్ గా నిద్రపోయి ఉదయాన్నే లేచి నీ మెసేజెస్ చూసుకుని నాకోసం పడుకోకుండా చాల సేపు వెయిట్ చేసావని తెలుసుకుని నేను ఎంతగా ఫీల్ అవుతానో తెలుసా. నా సంతోషమే నీ సంతోషం అని నవ్వుతూ నువ్వు నా పక్కనే వున్నావని నాకు తెలుసు.
hey r u in luv???????/
ReplyDeletenice........
ReplyDelete